నగరి నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎమ్మెల్యే రోజా శానిటైజర్ గొడుగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే రోజా... కరోనా నేపథ్యంలో విద్యార్థులు వైరస్ బారిన పడకుండా ఈ గొడుగులు రక్షణ కల్పిస్తాయని చెప్పారు. పిల్లల ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్యాభాస్యం సాగాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేక గొడుగులను అందజేశామని చెప్పారు.
శానిటైజర్ గొడుగులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రోజా - నగరిలో శానిటైజర్ గొడుగుల పంపిణీ
చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శానిటైజర్ గొడుగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజాతో పాటు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
mla roja