శుక్రవారం హఠాత్తుగా లోకాన్ని విడిచిన కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ అద్భుత నటుడే కాకుండా....సేవా కార్యక్రమాల్లోనూ ముందుండేవారని వైకాపా ఎమ్మెల్యే రోజా అన్నారు. ఎన్నో అనాథాశ్రమాలు, పాఠశాలలు, గోశాలలను నడిపించారని గుర్తు చేశారు. గొప్ప మనిషి, మంచి నటుడు ఇంత త్వరగా కాలం చేయడం కలచివేస్తోందని విచారం వ్యక్తం చేశారు.పునీత్‌కు తల్లిగా నటించిన చిత్రాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు.
ROJA : పునీత్ రాజ్‌కుమార్ మృతిపై ఎమ్మెల్యే రోజా విచారం - MLA Roja condolence
ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మృతిపై ఎమ్మెల్యే రోజా విచారం వ్యక్తం చేశారు. పునీత్‌కు తల్లిగా నటించిన చిత్రాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు.
పునీత్ రాజ్‌కుమార్ మృతిపై ఎమ్మెల్యే రోజా విచారం