ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MLA Roja: నగరి వైకాపాలో వర్గపోరు.. ప్రత్యర్థి వర్గంపై ఎస్పీకి ఎమ్మెల్యే రోజా ఫిర్యాదు - ఎమ్మెల్యే రోజా తాజా వార్తలు

MLA Roja: చిత్తూరు జిల్లా నగరి వైకాపాలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. వైకాపాలోని ఓ వర్గం కావాలనే తాను అక్రమ మైనింగ్‌ పాల్పడుతున్నానంటూ దుష్ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఈ విషయంపై చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్​ని కలిసి వారిపై ఫిర్యాదు చేశారు.

నగరి వైకాపాలో వర్గపోరు
నగరి వైకాపాలో వర్గపోరు

By

Published : Dec 31, 2021, 6:27 PM IST

ప్రత్యర్థి వర్గంపై ఎస్పీకి ఎమ్మెల్యే రోజాఫిర్యాదు

MLA Roja: వైకాపాలో ఓ వర్గం కావాలనే తాను అక్రమ మైనింగ్‌ పాల్పడుతున్నానంటూ దుష్ప్రచారం చేస్తోందని నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్​ని కలిసి వారిపై ఫిర్యాదు చేశారు. తన అనుచరులతో అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు కొందరు ఇటీవల డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారన్నారు. డీజీపీతో తీసుకున్న ఫొటోలకు ఇతర వ్యాఖ్యలు జోడించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. వైకాపా ముసుగులో ఉన్న ప్రతిపక్ష నేతలు..గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని త్వరలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పేదల గృహనిర్మాణాన్ని నిలుపుదల చేసేందుకే కొందరు కుట్రలు పన్నుతున్నారని రోజా ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details