ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారు' - జగన్​పై రోజా కాామెంట్స్

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం జగన్ ప్రయత్నిస్తుంటే...చంద్రబాబు అడ్డుపడుతున్నారని వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్​ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

'ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారు'
'ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారు'

By

Published : Nov 9, 2020, 3:35 PM IST

ముఖ్యమంత్రి జగన్​ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. ప్రజాసంకల్ప యాత్ర మూడేళ్లు పూర్తైన సందర్భంగా చిత్తూరు జిల్లా పుత్తూరులో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేసేందుకు జగన్ శ్రమిస్తున్నారన్నారు. పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తుంటే..ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

వైకాపా ప్రభుత్వం దళితులపై దాడులకు పాల్పడుతోందని దుష్ప్రచారం చేస్తున్నారని..మా నాయకుడు మాత్రం దళితులకు పెద్ద పీట వేస్తూ ఉపముఖ్యమంత్రి, మంత్రి పదవులు కట్టబెట్టారని గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details