చిత్తూరు జిల్లా పుత్తూరులో రోడ్డు భద్రతా వారోత్సవాలు శనివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రోజా పుత్తూరు పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. వేగం కన్నా ప్రాణం ఎంతో విలువైందని ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించాలని రోజా సూచించారు. ద్విచక్రవాహనదారులు శిరస్త్రాణం ధరించాలని ఆమె హితవు పలికారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు.