ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న ఎమ్మెల్యే రోజా - mla roja latest news

అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఎమ్మెల్యే రోజా డిశ్ఛార్జ్ అయ్యారు. చెన్నైలోని మలార్ ఆస్పత్రిలో రెండు శస్త్ర చికిత్సలు చేయించుకుని ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నారు.

mla rk roja discharge from malar hospital in chennai
ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా

By

Published : Apr 4, 2021, 3:21 PM IST

అనారోగ్యంతో చెన్నైలోని మలార్ ఆస్పత్రిలో చేరి, రెండు మేజర్ శస్త్ర చికిత్సలు చేయించుకున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా డిశ్ఛార్జ్ అయ్యారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడే వరకు రోజా చెన్నైలోని తన ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటారని ఆమె భర్త ఆర్కే సెల్వమణి తెలిపారు.

మరో వైపు ఎమ్మెల్యే రోజా ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ... ఆమె అభిమానులు, వైకాపా నేతలు శ్రీ దేశమ్మ ఆలయంలో పూజలు చేశారు. ఎమ్మెల్యే పేరిట అర్చనలు చేసి, 101 కొబ్బరికాయలు కొట్టారు. నేసనూరులో గ్రామ దేవత శ్రీకలుగు లక్ష్మమ్మ ఆలయంలో సర్పంచి గోవిందస్వామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details