ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గ్రామ వాలంటరీ, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన' - medivedu grama sachivalaya bhavan open

ప్రభుత్వం చేపట్టిన గ్రామ సచివాలయల, వాలంటరీ వ్యవస్థల ద్వారా ప్రజలకు పాలన మరింత దగ్గర అయిందని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి అన్నారు. కురబలకోట మండలంలోని ముదివేడులో నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు.

mla peddireddy dwarakanath reddy open medivedu grama sachivalaya bhavan chittoor district
గ్రామ వాలంటరీ, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన

By

Published : Oct 2, 2020, 6:00 PM IST

గ్రామ వాలంటరీ, గ్రామ సచివాలయ వ్యవస్థల ద్వారా అన్ని రకాల సేవలను ప్రజల వద్దకే తీసుకెళ్తున్నట్లు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి పేర్కొన్నారు. కురబలకోట మండల పర్యటనలో భాగంగా... ముదివేడు గ్రామ నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ వ్యవస్థలను ప్రధాని మోడీ కూడా ప్రశంసించారని గుర్తుచేశారు.

గత ప్రభుత్వం హయాంలో ప్రజలు సమస్యల పరిష్కారం కోసం మండల కేంద్రాల్లో అవస్థలు పడేవారని... ప్రస్తుతం గ్రామ సచివాలయాలు అందుబాటులో ఉండటం వల్ల ఆ భాద లేదన్నారు. అనంతరం కుల అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సచివాలయాల ఉద్యోగులు, వైకాపా కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details