చిత్తూరు జిల్లా పూతలపట్టు సమీపంలోని హాట్సన్ పాల డెయిరీలో గ్యాస్ లీకేజీ ఘటన బాధితులను ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పరామర్శించారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని... శుక్రవారం ఆయన పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు.
గ్యాస్ లీకేజీ ఘటన బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం - gas leakage at milk dairy in puthalapattu news
పూతలపట్టు సమీపంలోని పాల డెయిరీలో గ్యాస్ లీకేజీ ఘటన బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చెప్పారు. అధికారుల నివేదిక ఆధారంగా సంబంధిత యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్నారు.
puthalapattu gas leakage
బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆదేశించారు. బాధితులను
అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారుల నివేదిక ఆధారంగా ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్నారు.