లాక్ డౌన్ ప్రభావంతో పేదలకు చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లో పర్యటించారు.
సుమారు వెయ్యి మందికి కోడిగుడ్లు, కూరగాయలు, సరకులు అందజేశారు. లాక్ డౌన్ ప్రభావంతో తన వంతుగా సాయం చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.