ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తుపాన్లతో నష్టపోయిన ప్రజలను ఆదుకుంటాం' - తంబళ్లపల్లెలో ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి పర్యటన

తుపాన్ల ప్రభావంతో నష్టపోయిన రైతులను, ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో పర్యటించి.. నష్టపోయిన పంటలను పరిశీలించారు.

dwarakanath reddy
ద్వారకానాథ్ రెడ్డి, ఎమ్మెల్యే

By

Published : Dec 10, 2020, 6:30 PM IST

నివర్, బురేవి తుపాన్​ల ప్రభావంతో నష్టపోయిన నియోజకవర్గ ప్రజలను ఆదుకుంటామని.. చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి అన్నారు. నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులు, అధికారులతో మాట్లాడారు. బాధితులు వారి కష్టాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే ద్వారా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారని.. బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డిలు రైతుల కష్టాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆదుకునేందుకు కృషిచేస్తున్నారనిఎమ్మెల్యే చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details