చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పీలేరు, వాల్మీకిపురం, కలికిరి, కలకడ, గుర్రంకొండ, కె.వి పల్లి మండలాల్లో వైకాపా కార్యకర్తలతో కలిసి పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
పీలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే విస్తృత పర్యటన - పీలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే విస్తృత పర్యటన
పీలేరు శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పలు మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
వాల్మీకిపురం పట్టణ శివార్లలోని భోగంపల్లి రిజర్వాయర్ వద్ద నాలుగు తాగునీటి బోర్లను ప్రారంభించారు. గుర్రంకొండ మండలం శెట్టివారి పల్లి పంచాయతీకి తాగునీటి బోరును మంజూరు చేశారు.