రాష్ట్రంలో రాజకీయాలు సమరాన్ని తలపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇలాంటి వేళ.. ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించారు.
VIRAL VIDEO : చంద్రబాబుకు నమస్కరించిన.. ఎమ్మెల్యే చెవిరెడ్డి! - MLA Chevireddy Bhaskar reddy
చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు (Chandrababu tour in chittoor district)కు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నమస్కారం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
![VIRAL VIDEO : చంద్రబాబుకు నమస్కరించిన.. ఎమ్మెల్యే చెవిరెడ్డి! చంద్రబాబుకు నమస్కరించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13726398-55-13726398-1637766724289.jpg)
చంద్రబాబుకు నమస్కరించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
ఈ క్రమంలో కోతకు గురవుతున్న రాయల చెరువుకు సందర్శించడానికి వెళ్లిన చంద్రబాబుకు.. అక్కడే ఉన్న వైకాపా నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి(Chandragiri MLA chevireddy Bhasker Reddy) నమస్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
చంద్రబాబుకు నమస్కరించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
ఇదీచదవండి.