చిత్తూరు జిల్లా యర్రావారిపాళ్యం మండలంలోని తలకోనలో అన్నదాన సత్ర భవనం ఏర్పాటు చేయనున్నారు. నూతనంగా నిర్మించనున్న ఈ భవనానికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు భూమిపూజ నిర్వహించారు. మాజీ జడ్పీ చైర్మన్ సీతారామరాజు జ్ఞాపకార్ధం వారి కుమారులు 60 లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. అంతకుముందు ఆలయ అర్చకులు, పాలకమండలి సభ్యులు.. ఎమ్మెల్యే చెవిరెడ్డి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రేవతి రెడ్డప్ప రెడ్డి, ఈవో జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
సిద్దేశ్వరస్వామి ఆలయంలో సత్రం నిర్మాణానికి భూమిపూజ - talakona Siddeshwaraswamy Temple news update
తలకోన సిద్దేశ్వరస్వామి దేవాలయంలో అన్నదాన సత్ర భవన నిర్మాణానికి ఎమ్మెల్యే దంపతులు భూమిపూజ చేశారు. దాతల సహాయంతో అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
సిద్దేశ్వరస్వామి ఆలయంలో అన్నదాన సత్రానికి ఎమ్మెల్యే భూమిపూజ
ఇవీ చూడండి...