యుక్త వయస్సులో మత్తు పదార్థాలకు అలవాటు పడితే.. బంగారు భవిష్యత్తును కోల్పోవాల్సి వస్తుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. నగరంలో గంజాయి, మద్యం, మత్తు పదార్థాలను సేవించేందుకు అవకాశం ఉన్న ఇందిరానగర్, ఎస్వీనగర్, వెస్ట్ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే అవగాహన కల్పించారు. వ్యసనపరుల కారణంగా ఆయా ప్రాంతాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను.. స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి సేకరించిన వివరాలను స్థానిక పోలీసులకు తెలియజేశారు.
మత్తుకు అలవాటు పడితే.. భవిష్యత్తులో ఇబ్బందులు: ఎమ్మెల్యే భూమన - thirupathi crime
తిరుపతిలో మత్తు పదార్థాలు సేవించేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. యుక్తవయస్తులో డ్రగ్స్‌కు అలవాటు పడితే.. భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆయన అన్నారు.
ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతికి మచ్చ తెస్తున్న ఈ మత్తు జాడ్యాన్ని పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని హితవు పలికారు.
ఇదీచదవండి.