MLA FIRES ON OFFICERS: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం గాండ్లపల్లె సచివాలయం పరిధిలో మంగళవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అధికారులను తిట్టిపోశారు. అందరి ముందు పరుష పదజాలంతో తిట్టడంతో వీఆర్వో రవి కన్నీరు పెట్టుకుంటూ వెళ్లిపోయారు. తహసీల్దారు మనస్తాపానికి గురయ్యారు. మండలంలోని కాళేపల్లె గ్రామంలో కొందరు భూమి, బియ్యంకార్డు సమస్యలు చెప్పడంతో ఊగిపోయిన ఎమ్మెల్యే ‘‘మా పార్టీ వారికే న్యాయం చేయకపోతే ఎలా?’’ అంటూ రెవెన్యూ అధికారులను తిట్టారు. తహసీల్దారును బుద్ధి ఉందా? లేదా? అనడంతో పాటు.. వీఆర్వోను ఏకంగా బూతులు తిట్టారు. బాధ్యతలు చేపట్టి నెల రోజులు కూడా కాకపోవడంతో పూర్తి స్థాయిలో పట్టులేదని, సమస్యలు పరిష్కరిస్తామని వీఆర్వో చెబుతున్నా ఏమాత్రం పట్టించుకోలేదు. అనంతరం గాండ్లపల్లెలో ఒక కుటుంబానికి ఇవ్వాల్సిన ప్రభుత్వ పథకాల నివేదికను మరో కుటుంబానికి ఇవ్వడంతో వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ‘కడుపునకు ఏం తింటున్నారు’’ అని విరుచుకుపడ్డారు. నొచ్చుకున్న అధికారులకు మండల నాయకులు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు.
MLA FIRES ON OFFICERS: అధికారులను తిట్టిన ఎమ్మెల్యే బాబు.. కన్నీరుపెట్టుకున్న వీఆర్వో - చిత్తూరు జిల్లా తాజా వార్తలు
MLA FIRES ON OFFICERS: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం గాండ్లపల్లె సచివాలయం పరిధిలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అధికారులను తిట్టిపోశారు. అందరి ముందు పరుష పదజాలంతో తిట్టడంతో వీఆర్వో రవి కన్నీరుపెట్టుకుంటూ వెళ్లిపోయారు. నొచ్చుకున్న అధికారులకు మండల నాయకులు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు.
MLA FIRES ON OFFICERS