ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు నెలలుగా సహజీవనం.. మరొకరితో వివాహం

చిత్తూరు జిల్లా గంగవరం మండలం మిట్టమీద కురప్పల్లికి చెందిన గణేష్​పై.. పెద్దపంజాణి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసిందో యువతి. మూడు నెలలుగా సహజీవనం చేస్తూ, పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మరొకరిని వివాహం చేసుకున్నాడని పేర్కొంది. తనకు న్యాయం చేయాలంటూ.. పోలీసులను ఆశ్రయించింది.

cheating case
వివరాలు వెల్లడిస్తున్న బాధితురాలు

By

Published : Nov 20, 2020, 10:51 PM IST

పెళ్లి చేసుకుంటానని గణేష్ అనే వ్యక్తి తనను నమ్మించి మోసం చేశాడంటూ చిత్తూరు జిల్లా పెద్దపంజాణి పోలీస్ స్టేషన్​లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఇంతకాలం సహజీవనం చేస్తూ.. మరొకరిని వివాహమాడాడని పేర్కొంది.

గంగవరం మండలం మిట్టమీద కురప్పల్లికి చెందిన గణేష్​, పెద్దపంజాణి మండలానికి చెందిన ఈ యువతి.. గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పలమనేరులోని ఓ ప్రైవేటు కళాశాల​లో చదువుకునే సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. రెండేళ్ల క్రితం ఇరువురూ బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని.. మూడు నెలలుగా సహజీవనం చేస్తున్నారు. కరోనా సమయంలో లాక్‌డౌన్‌ కారణంగా గణేష్ సొంత గ్రామానికి చేరుకున్నాడు. ఆమె ఫోన్ చేస్తున్నా ఇంతకుముందులా పట్టించుకోవడం లేదు. అసలేమైందని యువతి ఆరా తీయగా.. బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాలు వెల్లడిస్తున్న బాధితురాలు

ఇదీ చదవండి:'మదనపల్లెను జిల్లాగా ప్రకటించే వరకు ఉద్యమం ఆపేది లేదు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details