ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలుడి అదృశ్యం కేసును గంటల్లో ఛేదించిన పోలీసులు - boy missing case

చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు పార్లపల్లిలో ఓ చిన్నారి అదృశ్యం కేసును పోలీసులు గంటల్లోనే ఛేదించారు. ప్రత్యేక బృందాలతో గాలింపు జరిపి బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.

బాలుడి అదృశ్యం కేసును గంటల్లో చేధన
బాలుడి అదృశ్యం కేసును గంటల్లో చేధన

By

Published : Apr 28, 2021, 8:04 PM IST

Updated : Apr 28, 2021, 8:32 PM IST

చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం పార్లపల్లికి చెందిన కుమారస్వామి, జయంతిల కుమారుడు అభిరామ్(7) మంగళవారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ అదృశ్యమయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

సీఐ ఆరోహణరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం.. బుచ్చినాయుడు, కండ్రిగ, శ్రీకాళహస్తి మధ్య గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తి మండలం రామాపురం రిజర్వాయర్ వద్ద కొందరు వ్యక్తులతో కలిసి అభిరామ్ ఉండడం గమనించారు. పోలీసులను చూసిన నిందితులు బాలుడిని అక్కడ వదిలి పరారయ్యారు. చిన్నారిని పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

Last Updated : Apr 28, 2021, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details