ఏపీలోని 3 రిజర్వాయర్లకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి.. ఎన్జీటీలో కేంద్రం నివేదిక - ap news
19:56 January 25
అవులపల్లి, ముదివేడు రిజర్వాయర్లకు అనుమతి తప్పనిసరి: కేంద్రం
ఏపీ చేపట్టిన అవులపల్లి, ముదివేడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్లకు అనుమతి తప్పనిసరని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్జీటీలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నివేదిక దాఖలు చేసింది. 3 రిజర్వాయర్లు గాలేరు-నగరి, సుజల స్రవంతి పరిధిలోకి రావని పేర్కొంది.
శ్రీశైలం జలాలు చిత్తూరు జిల్లాకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం.. రూ.6 వేల కోట్లతో 3 రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకం ప్రతిపాదించింది. అనుమతులు లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణ పనులు చేపట్టింది. వీటిపై పలువురు బాధితులు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. పొలాలను ముంచేలా రిజర్వాయర్లు చేపట్టినట్లు పిటిషన్ వేశారు. ఎన్జీటీ ఆదేశాలతో ఈ 3 ప్రాజెక్టులపై కేంద్రం నివేదిక దాఖలు చేసింది. ఈ మేరకు 3 ప్రాజెక్టుల పనులు చేపట్టబోమని ఎన్జీటీలో ఏపీ అండర్ టేకింగ్ ఇచ్చింది.
ఇదీ చూడండి:PRC Struggle committee: ప్రభుత్వంతో చర్చలకు వెళ్లం.. పీఆర్సీ సాధన సమితి నిర్ణయం
TAGGED:
Ministry of Environment