ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చర్యలు: డిప్యూటీ సీఎం

By

Published : May 28, 2021, 10:55 PM IST

Updated : Jun 8, 2021, 3:08 PM IST

అర్హులందరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంత్రులు అధికారులతో సమావేశం నిర్వహించారు.

chittore
అధికారులతో మంత్రుల సమావేశం

అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు చేపట్టాలని ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అధికారులతో కలసి ఆయన సమావేశం నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలులో జిల్లాను ముందంజలో ఉంచాలని అధికారులకు నారాయణ సూచించారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రెండు కోట్ల పని దినాలను కల్పించేందుకు ప్రణాళికను సిద్దం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. వైఎస్ఆర్ జలకళ కింద అందిన ధరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించి బోర్లు వేసే ప్రక్రియ వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. జగనన్న కాలనీలలో వేసిన బోర్లకు వెంటనే విద్యుత్తు కనెక్షన్​లు ఇవ్వాలని ట్రాన్స్​కో అధికారులను మంత్రి ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అందించే ప్రక్రియపై అధికారులు దృష్టి సారించాలన్నారు.

Last Updated : Jun 8, 2021, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details