కర్నూలు జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాద మృతులకు... మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి నివాళులు అర్పించారు. పోస్టుమార్టం తర్వాత చిత్తూరు జిల్లాకు 14 మృతదేహాలు చేరుకోగా.. మదనపల్లెలో టెంపో డ్రైవర్ నజీర్ కుటుంబాన్ని మంత్రులు పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం కింద చెక్కులను అందించారు. మృతుల ఖనన కార్యక్రమానికి హాజరయ్యారు.
కర్నూలు ప్రమాదం: మృతుల కుటుంబాలకు మంత్రుల పరామర్శ - kurnool accident latest news
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించినవారికి మంత్రులు నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందజేశారు. మృతుల ఖనన కార్యక్రమానికి హాజరయ్యారు.

కర్నూలు ప్రమాదం: బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రులు