ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాణిపాక ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన మంత్రులు - Minister Vellampalli news

చిత్తూరు జిల్లా కాణిపాక ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రులు నారాయణస్వామి, వెల్లంపల్లి, పెద్దిరెడ్డి హాజరయ్యారు. కాణిపాక ఆలయాన్ని రూ.9 కోట్లతో పునఃనిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు.

ministers
మంత్రులు

By

Published : Jun 24, 2021, 11:54 AM IST

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కాణిపాక ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆలయ ఈవో వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కాణిపాక ఆలయాన్ని రూ.9 కోట్లతో పునఃనిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. వైకాపా హయంలో ఆలయాల అభివృద్ధి జరుగుతుందన్నారు. చంద్రబాబు.. రాష్ట్రంలో కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details