దేశంలో ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసిన ఘనత వైకాపాకే దక్కుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు, వెదురుకుప్పం, పెనుమూరు మండలాల్లో పలు గ్రామీణ రోడ్లను ఉపముఖ్యమంత్రి నారాయణస్వామితో కలిసి మంత్రి ఆదివారం ప్రారంభించారు.
గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా సుమారు రూ.286 కోట్ల నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. డిసెంబరు 25న చేపట్టే ఇళ్ల పంపిణీతో నవరత్నాల పథకాలన్నీ అమలైనట్లేనని వెల్లడించారు. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు సాగుతున్న వైకాపాను ప్రజలు ఆదరించాలని నేతలు కోరారు.
హామీలన్నీ అమలు చేసిన ఘనత వైకాపాదే: మంత్రి పెద్దిరెడ్డి - నెల్లూరులో గ్రామీణ రోడ్లను ప్రారంభం
ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా వైకాపా ముందుకు సాగుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. చిత్తూరు జిల్లాలోని పలు మండలాల్లో గ్రామీణ రోడ్లను ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామితో కలిసి ఆయన ప్రారంభించారు.
నెల్లూరులో గ్రామీణ రోడ్లను ప్రారంభించిన మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి