తిరుమల శ్రీవారిని మంత్రి వేణుగోపాల కృష్ణ.. కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్న మంత్రికి.. ఆలయ సభ్యులు తీర్థప్రసాదాలు అందించారు. సొంత ఇల్లు లేని వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి సంకల్పం చేశారని మంత్రి తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజున పట్టాలను పంపిణీ చేస్తారని అన్నారు. సుమారు 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వేణుగోపాల కృష్ణ - తిరుమల తిరుపతి దేవస్థానం తాజా వార్తలు
మంత్రి వేణుగోపాల కృష్ణ.. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. సుమారు 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
minister venugopala krishna
TAGGED:
తిరుపతి న్యూస్ అప్డేట్స్