Minister Roja Played Kabaddi: చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాలలో మంత్రి ఆర్.కె. రోజా జగనన్న క్రీడా సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె క్రీడాకారులతో కబడ్డీ ఆడి వారిలో ఉత్సాహం నింపారు. ఈ పోటీలో జిల్లాలోని కుప్పం, పలమనేరు, పుంగనూరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్రీడాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం క్రికెట్, ఫుట్బాల్ పోటీలను ప్రారంభించారు.
కబడ్డీ ఆడిన మంత్రి రోజా.. క్రీడాకారుల్లో జోష్ - Minister Roja News
Minister Roja Played Kabaddi: క్రీడా శాఖ మంత్రి ఆర్.కె. రోజా కబడ్డీ ఆడి క్రీడాకారుల్లో జోష్ పెంచారు. చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాలలో జగనన్న క్రీడా సంబరాలను ప్రారంభించిన ఆమె.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రీడాభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

మంత్రి రోజా
ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప జేసీ వెంకటేశ్వర్, డీఈఓలు విజయేంద్ర, శేఖర్, ఆర్డీఓ సృజన, ఎమ్మార్వో చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ వెంకట్రామి రెడ్డి, సెట్విన్ సీఈవో మురళీకృష్ణ, మేనేజర్ మురళిలు పాల్గొన్నారు.
జగనన్న క్రీడలను ప్రారంభించి కబడ్డీ ఆడిన మంత్రి రోజా
ఇవీ చదవండి: