ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డుపై గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి చేర్చిన మంత్రి పెద్దిరెడ్డి - మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజా వార్తలు

చిత్తూరు జిల్లా సోమల మండలం దుర్గం కొండ సమీపంలో రోడ్డు మీద గాయపడిన ఓ యువకుడిని.. అటుగా వెళ్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసుపత్రికి చేర్చారు. ప్రాథమిక చికిత్స అందించి.. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాలని సిబ్బందిని ఆదేశించారు.

minister peddireddy ramachandra reddy
రోడ్డుపై గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి చేర్చిన మంత్రి పెద్దిరెడ్డి

By

Published : Mar 11, 2021, 1:08 PM IST

దుర్గం కొండ సమీపంలో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. సహాయం చేసే వారు లేక అక్కడే పడి ఉన్నాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్షతగాత్రుడిని పరిశీలించారు.

వెంటనే అతడికి ప్రాథమిక చికిత్స అందించి.. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. బాధితుడిని వీరప్పల్లికి చెందిన సుబ్రహ్మణ్యంగా గుర్తించిన సిబ్బంది.. ఆసుపత్రిలో చేర్పించారు.

ABOUT THE AUTHOR

...view details