సుప్రీం కోర్టు ఉత్తర్వులను తాను ఉల్లంఘిస్తున్నానని ఎస్ఈసీ చెప్పడం.. బ్లాక్ మెయిల్ చేయడమేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికలపై జిల్లాలోని వైకాపా ఎమ్మెల్యేలతో.. తిరుపతిలో ఆయన సమావేశమయ్యారు. తెదేపా అధినేత చంద్రబాబుకు ఎస్ఈసీ బంట్రోతులా పనిచేస్తోందని ఆరోపించారు. పంచాయతీలు ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు.
'చంద్రబాబుకు ఎస్ఈసీ బంట్రోతులా పనిచేస్తోంది' - పంచాయతీల ఏకగ్రీవాలపై ఎమ్మెల్యేలకు తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి సూచన
పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం చేసేలా కృషిచేయాలని.. వైకాపా ఎమ్మెల్యేలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. ఎస్ఈసీ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. చంద్రబాబుకు బంట్రోతులా వ్యవహరిస్తున్నారని తిరుపతిలో ఆరోపించారు.
!['చంద్రబాబుకు ఎస్ఈసీ బంట్రోతులా పనిచేస్తోంది' minister peddireddy meeting with ycp mlas at tirupati](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10411860-441-10411860-1611832347157.jpg)
వైకాపా ఎమ్మెల్యేలతో తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి సమావేశం