ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Peddireddy: ఆ ఎత్తిపోతల పథకాలను.. రెండేళ్లలో పూర్తి చేస్తాం: మంత్రి పెద్దిరెడ్డి - హంద్రీనీవా తాజా వార్తలు

చిత్తూరు జిల్లాలోని మొలకలవారి పల్లె సమీపంలో... నాయని చెర్వు వద్ద గాలేరు నగరి, హంద్రీనీవా అనుసంధాన పథకానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. కడప, చిత్తూరు జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.

Minister Pddireddy
Minister Pddireddy

By

Published : Jul 4, 2021, 8:42 PM IST

హంద్రీనీవా కాలువ ద్వారా ఇస్తున్న జలాలను స్థిరీకరించి కడప, చిత్తూరు జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడమే వైకాపా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గం పరిధిలోని మొలకలవారి పల్లె సమీపంలో నాయని చెర్వు వద్ద గాలేరు నగరి, హంద్రీనీవా అనుసంధాన పథకానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

గండికోట జలాశయం నుంచి నీటిని మళ్లించి చిత్తూరు జిల్లా వాసులకు నీరు అందించడానికి 4373. 93 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకం చేపట్టామన్నారు. సంవత్సరంలో 120 రోజుల పాటు 20 టీఎంసీల నీటిని కడప చిత్తూరు జిల్లాలకు పైపు లైన్ల ద్వారా అందించేలా ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నట్లు తెలిపారు. గండికోట జలాశయం నుంచి తరలించే నీటిని అడవిపల్లి జలాశయానికి నింపి పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాలకు తాగు, సాగు నీటి అవసరాలకు వినియోగిస్తామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. రానున్న రెండేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసి గతంలో నిర్ణయించిన 1.41 లక్షల ఎకరాలతో పాటు కొత్తగా మరో 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details