చిత్తూరు జిల్లా పీలేరులో వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. 50 పడకలుగా ఉన్న ఆసుపత్రి ఎంపీ మిథున్‌రెడ్డి చొరవతో 100 పడకల ఆసుపత్రిగా మారిందన్నారు. ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ 30 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు.
అనంతరం ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... తెదేపా పాలనలో నేతలు పీలేరులో ప్రభుత్వ భూములు,కొండలు, గుట్టలు ఆక్రమించుకున్నారన్నారు. వాటన్నింటిని స్వాధీనం చేసుకొని పేదలకు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. సీఎం జగన్ చొరవతో మదనపల్లి-తిరుపతి బైపాస్ రహదారి నిర్మాణ పనులు ఊపందుకున్నట్లు తెలిపారు. త్వరలోనే భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని గత ప్రభుత్వం అడ్డుకుందని మంత్రి విమర్శించారు.