చిత్తూరు జిల్లా రొంపిచర్లలో నూతన బ్యాంకు ఆఫీస్ సహా పలు అభివృద్ధి పనులను మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, నాణ్యమైన ఎరువులు విత్తనాలను రైతులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
రైతు భరోసా కేంద్రాలు..
రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు పంటకు గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు చేపట్టామని మంత్రి రామచంద్రారెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ తులసి, డ్వామా పీడీ చంద్రశేఖర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
నూతన బ్యాంకు , ఏటీఎంను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి ఇవీ చూడండి : అలాంటి వారిని చూసి చప్పట్లు కొట్టాలా..? తెదేపా