చిత్తూరు జిల్లా, పుంగనూరులో ఇళ్ల పట్టాలు, టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో 31 లక్షల 76 వేల ఇంటి పట్టాలను పేదలకు అందించనున్నామని అన్నారు. పుంగనూరులో రూ. 5 కోట్ల 50లక్షల నిధులతో ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆరోగ్య కేంద్ర అదనపు నూతన భవనాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా కుప్పానికి సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని నాలుగు లక్షల మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి.. ప్రజల ఇంటి వద్దకే వెళ్లి పని చేసే వ్యవస్థను తీసుకువచ్చామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే 95% హామీలను అమలు పరచిందని తెలిపారు.
'రాష్ట్రంలో 31 లక్షల 76 వేల మందికి ఇంటి పట్టాలు..' - చిత్తూరు న్యూస్
రాష్ట్రంలోని 31 లక్షల 76 వేల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా, పుంగనూరులో రూ. 5 కోట్ల 50 లక్షల నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆరోగ్య కేంద్ర అదనపు నూతన భవనాల నిర్మాణానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు.
రూ. 5 కోట్ల 50 లక్షలతో చేపట్టిన భవనాల శంకుస్థాపన