తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సమీపంలో... శనివారం రాత్రి నాటుబాంబు పేలింది. ఈ ప్రాంతాన్ని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పరిశీలించారు. అడవి పందులు రాకుండా ఏర్పాటు చేసుకునేందుకు వేరేవాళ్లు ఆటోలో తీసుకొచ్చారని... ఆ బాంబును కుక్క లాక్కెళ్లటంతోనే ఈ ఘటన జరిగిందని ఎస్పీ మంత్రికి వివరించారు. భద్రతా పర్యవేక్షణను ఆసుపత్రుల వద్ద పటిష్ఠం చేయాలని ఎస్పీకి సూచించిన మంత్రి... అనంతరం ఆసుపత్రిని పరిశీలించి రోగులతో మాట్లాడారు. వైఎస్ఆర్ కిట్లను వారికి అందించి... వైద్యసేవలపై ఆరా తీశారు. మంత్రికినగర శాసనసభ్యుడు భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి అర్బన్ ఎస్పీ గజరావు భూపాల్ స్వాగతం పలికారు.
బాంబుపేలిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి ఆళ్లనాని - Minister Maternity Hospital Visit
ఈ నెల 28న తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో నాటు బాంబు పేలిన ప్రాంతాన్ని మంత్రి ఆళ్లనాని పరిశీలించారు.
![బాంబుపేలిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి ఆళ్లనాని Minister Maternity Hospital Visit](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5537334-614-5537334-1577691608294.jpg)
బాంబుపేలిన ప్రాంతాన్ని పరిశీలించిన...మంత్రి ఆళ్లనాని
Last Updated : Dec 30, 2019, 3:16 PM IST