ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తలనీలాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి వైకాపాకు లేదు: మంత్రి కొడాలి నాని - tirupathi bi election campaign news

తలనీలాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి వైకాపాకు లేదని మంత్రి కొడాలి నాని అన్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని పిచ్చాటూరులో నిర్వహించిన ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

minister kodali nani
ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న మంత్రి కొడాలి నాని

By

Published : Apr 2, 2021, 7:43 AM IST

బయటి ప్రాంతాల్లో దొరికిన తలనీలాలను తితిదేతో ముడిపెట్టి రాజకీయం చేయడం తగదని మంత్రి కొడాలి నాని అన్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని పిచ్చాటూరులో తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తలనీలాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి సీఎం, వైవీ సుబ్బారెడ్డికి లేదని ఆయన అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన 20నెలల కాలంలోనే 90% హామీలను నెరవేర్చిందన్నారు. తమ అభ్యర్థిని అఖండ విజయంతో గెలిపించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details