ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

tirumala: శ్రీవారి సేవలో మంత్రి అవంతి, ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు - అవంతి తిరుమల పర్యాటన వార్తలు

శ్రీవారిని నేటి ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో మంత్రి అవంతి, ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు.

minister Avanti Srinivas
శ్రీవారి సేవలో మంత్రి అవంతి

By

Published : Jul 11, 2021, 10:20 AM IST

తిరుమల శ్రీవారిని మంత్రి అవంతి శ్రీనివాస్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంకు చేరుకున్న మంత్రికి తితిదే ఆధికారులు స్వాగతం పలికి.. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కరోనా నుంచి మానవాళిని రక్షించాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఆంక్షలను సడలిస్తున్నామని... రాబోవు రోజుల్లో తిరుపతిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే యోచనలో ఉన్నామని మంత్రి అవంతి తెలిపారు..

తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయటం దారుణం

ఆంధ్రప్రదేశ్​కు రావాల్సిన వాటా నీటితో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయడం దారుణమని ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. వీఐపి ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. రెండు రాష్ట్రాలతో కృష్ణా బోర్డు చర్చించి న్యాయం చేయాలన్నారు. నీరు రాకపోతే రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు.

ఒక్కరోజు ఆదాయం రూ.1.26 కోట్లు..

తిరుమల శ్రీవారిని శనివారం రోజున 18,782 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 8,778 మంది భక్తులు తలనీలాలను స్వామి వారికి సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.26 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:MP RRR LETTER TO CM: నిధులు దారి మళ్లిస్తే ఉత్పాతమే

ABOUT THE AUTHOR

...view details