తిమలేశుడిని దర్శించుకున్న ప్రముఖులు - minister
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, కాబోయే శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారిని కాబోయే శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో విడివిడిగా ఆలయానికి చేరుకున్న వారికి తితిదే అధికారులు సాదర స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దేవాలయం లాంటి శాసనసభలో పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కోన రఘుపతి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ తనపై పెట్టిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు.