చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం కోట వారి పల్లి రైతులు... ప్రకృతి వ్యవసాయం గులి పద్ధతిలో చిరుధాన్యాలను సాగుచేస్తున్నారు. ఈ క్షేత్రాన్ని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ పరిశీలించారు. కోట వారి పల్లి రైతులతో మాట్లాడారు. చిరుధాన్యాల సాగులో రైతుల అనుభవాలు తెలుసుకున్నారు. తక్కువ ఖర్చుతో చిరుధాన్యాల సాగు చేసే పద్ధతులపై సూచనలు చేశారు. రైతులు సాగుచేసిన రాగి, అండు కోర్రలు పంటలను ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ అధికారులు పరిశీలించారు.
చిరుధాన్యాల ఉత్పత్తికి.. ప్రకృతి వ్యవసాయం భేష్! - చిరుధాన్యాలు
తక్కువ ఖర్చుతో.. ప్రకృతి వ్యవసాయం ఆధారితంగా చిరుధాన్యాలను పండిస్తున్న చిత్తూరు జిల్లా రైతులను వ్యవసాయ శాఖ కార్యదర్శి అభినందించారు.
చిరుధాన్యాల ఉత్పత్తికి ప్రకృతి వ్యవసాయం భేష్