ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేణిగుంట నుంచి ఉత్తరాదికి ప్రత్యేక రైలులో పాలు సరఫరా - milk transport news

లాక్​డౌన్​ కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు నిత్యావసరాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాల కోసం కటకటలాడాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పాల సరఫరా కోసం ఓ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. దీని ద్వారా 2 లక్షల 40 వేల లీటర్లను సరఫరా చేయనుంది.

రేణిగుంట నుంచి ఉత్తరాదికి ప్రత్యేక రైలులో పాలు సరఫరా
రేణిగుంట నుంచి ఉత్తరాదికి ప్రత్యేక రైలులో పాలు సరఫరా

By

Published : Mar 27, 2020, 4:37 AM IST

ప్రత్యేక రైలులో పాలు సరఫరాపై మా ప్రతినిధి అందిస్తోన్న వివరాలు

లాక్‌డౌన్‌ కారణంగా రవాణా వ్యవస్థ నిలిచిపోవడం వల్ల దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పాల కొరత ఏర్పడింది. దక్షిణాది నుంచి.. నిత్యం రైళ్ల ద్వారా సరఫరా అయ్యే నిత్యావసరాలన్నీ నిలిచిపోవటంతో... ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వీటిని దృష్టిలో ఉంచుకుని.. దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పాల సరఫరా కోసం... ప్రత్యేకంగా ఓ గూడ్సు రైలును ఏర్పాటు చేసింది. చిత్తూరు జిల్లా రేణిగుంట నుంచి దిల్లీకి పాల సరఫరా చేపట్టింది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సేకరించిన 2 లక్షల 40 వేల లీటర్ల పాలతో రేణిగుంట నుంచి దిల్లీకి ప్రారంభమైన ప్రత్యేక రైలు గురించి మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తోన్న వివరాలు..!

ABOUT THE AUTHOR

...view details