ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లోయలోకి దూసుకెళ్లిన పాల ట్యాంకర్.. 20 వేల లీటర్లు నేల'పాలు'! - భాకరాపేట కనుమ తాజా వార్తలు

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని భాకరాపేట కనుమ దారిలో ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. పీలేరు నుంచి తిరుపతికి వస్తున్న పాల ట్యాంకర్.. అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్​కు స్వల్ప గాయాలయ్యాయి. గత కొద్ది రోజుల క్రితం.. టమోటా, కోళ్లు, కెమికల్, ఐరన్ లారీలు లోయలో పడ్డాయి. ఆ దారిలో ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

milk tank rolled off at  bhakarapeta  kanuma
లోయలోకి దూసుకెళ్లిన పాల ట్యాంకర్..

By

Published : Jul 28, 2021, 10:38 AM IST

లోయలోకి దూసుకెళ్లిన పాల ట్యాంకర్..

నిత్యం ఆ దారిలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని భాకరాపేట కనుమ దారిలో.. ఓ పాల ట్యాంకర్ అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్​కు స్వల్ప గాయాలయ్యాయి. సుమారు 20 వేల లీటర్లకు పైగా పాలు.. వృథా అయ్యాయి.

తిరుపతి - అనంతపురం జాతీయ రహదారిపై భాకరాపేట కనుమ... సుమారు 12 కిలోమీటర్ల మేర ఉంది. ఈ మార్గంలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదన్న విమర్శలున్నాయి. కొన్నిరోజుల క్రితం టమాటా, కోళ్లు, రసాయనాలు, ఐరన్​తో వెళ్తున్న లారీలు లోయలోకి దూసుకెళ్లాయి. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. అదే తరహాలో ఈ రోజు సైతం.. పీలేరు నుంచి తిరుపతికి వస్తున్న పాల ట్యాంకర్ అదుపుతప్పి లోయలో పడింది. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు గాయపడినవారిని తిరుపతి రుయా ఆసుపత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు అన్నారు. అధికారులు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలు చేపట్టకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారని.. స్థానికులు ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details