ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు నుంచి ఒడిశాకు 1200 మంది వలస కార్మికులు - చిత్తూరులో ఒడిశా వలస కార్మికులు

కొన్ని రోజులుగా వలస కార్మికులను స్వస్థలాలకు పంపుతున్న అధికారులు.. నేడు చిత్తూరు జిల్లా నుంచి 1200 మంది కూలీలను శ్రామిక్ రైల్లో ఒడిశాకు పంపించారు. వారందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించి, భోజన సదుపాయం ఏర్పాటు చేసి స్వగ్రామాలకు తరలించారు.

చిత్తూరు నుంచి ఒడిశాకు 1migrant labours went to odisa from chittore district200 మంది వలస కార్మికులు
చిత్తూరు నుంచి ఒడిశాకు 1200 మంది వలస కార్మికులు

By

Published : May 30, 2020, 12:04 PM IST

చిత్తూరులోని ఒడిశాకు చెందిన 1200 మంది వలస కూలీలను జిల్లా అధికారులు వారి స్వగ్రామాలకు పంపించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కార్మికులను బస్సుల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడ వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఫలితాలు నెగెటివ్ అని తేలిన కారణంగా.. వారిని శ్రామిక్ రైల్లో స్వస్థలాలకు పంపారు. కలెక్టర్ మార్కండేయులు, కొవిడ్ ప్రత్యేక అధికారి చంద్రమౌళి ఈ ప్రక్రియను పర్యవేక్షించారు.

ABOUT THE AUTHOR

...view details