ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వలస కూలీలను స్వస్థలాలకు చేరుస్తున్న ప్రభుత్వం - చిత్తూరులో కరోనా కేసులు

ఇరత రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు లాక్​డౌన్ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారి స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో... వలస కార్మికుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ముందగా జిల్లా కేంద్రాలకు తరలించి..అక్కడి నుంచి ప్రత్యేక రైళ్ల ద్వారా వారి స్వస్థలాలకు పంపిస్తున్నారు.

migrant laborers in chittoor
migrant laborers in chittoor

By

Published : May 6, 2020, 6:48 PM IST

చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం హీరో పరిశ్రమలో పనిచేస్తున్న వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపిస్తున్నారు. వీటికోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి జిల్లా కేంద్రాలకు తరలించారు. ఇందులో బీహర్, యూపీ, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల కార్మికులు అత్యధికాంగా ఉన్నారు.

735 కార్మికుల్లో బీహర్​కు చెందిన 303 కార్మికులను అధికారులు వారి స్వస్థలాలకు తరలించారు. రెండో విడతలో మిగిలిన వారిని పంపిస్తామని తెలిపారు. ముందుగా చిత్తూరు, తిరుపతి ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి ప్రత్యేక రైళ్లలో వారి స్వస్థలాలకు పంపిస్తారు.

ఇవీ చదవండి:సైన్యం కీలక విజయం- హిజ్బుల్​ సారథి​ హతం

ABOUT THE AUTHOR

...view details