చెరుకు రైతుల సంక్షేమం కోసం విశేష కృషిచేసిన గుత్తా జీకేనాయుడు మృతికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ.. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాప సందేశాన్ని పంపించారు. చిత్తూరు జిల్లా నిండ్ర మండలానికి చెందిన గుత్తా జీకేనాయుడు జీవిత పర్యంతం రైతు సంక్షేమం కోసం విశేషంగా కృషి చేశారని వెంకయ్యనాయుడు కొనియాడారు. సర్పంచ్ పదవి మొదలుకుని చక్కెర కర్మాగారాలను ప్రారంభించేలా చేయటం వరకూ.. చెరుకు రైతుల కోసం ఆయన చేసిన కృషి భావితరాలకు ఆదర్శప్రాయమని ఉపరాష్ట్రపతి కొనియాడారు. జీకేనాయుడు చేసిన సేవలను స్మరిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. భావితరాలు జీకేనాయుడి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని... రైతుల సంక్షేమం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.
గుత్తా జీకేనాయుడు మృతి పట్ల భారత ఉపరాష్ట్రపతి సంతాప సందేశం - Chittoor District Latest News
గుత్తా జీకేనాయుడు మృతికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ.. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాప సందేశాన్ని పంపించారు. భావితరాలు జీకేనాయుడి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని.. రైతుల సంక్షేమం కోసం పాటుపడాలని ఉపరాష్ట్రతి పిలుపునిచ్చారు.

Message of condolence from the Vice President of India on the death of Gutta GK Naidu