చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీ ప్రధాన స్మశాన వాటికలో దహన సంస్కారాల కోసం కొత్తగా షెడ్లు నిర్మాణానికి ఎమ్మెల్యే రోజా శిలాఫలకం ఆవిష్కరించారు. దహన సంస్కారాల కోసం ఎలక్ట్రికల్ పరికరాలు కావాలని కోరగానే చిత్తూరు ఎంపీ రెడ్డప్ప స్పందించారని రోజా అన్నారు. 50 లక్షల నిధులతో ఈ షెడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. మరో 50 లక్షలను స్మశానవాటికలో అభివృద్ధి పనులకు వాడనున్నట్లు తెలిపారు.
'వైకాపా పాలనపై ఆరోపణలు తగవు' - పుత్తూరులో రోజా
చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీ స్మశాన వాటికలో దహన సంస్కరాల కోసం కొత్త షెడ్ల నిర్మాణానికి... ఎమ్మెల్యే రోజా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
!['వైకాపా పాలనపై ఆరోపణలు తగవు' memorial inaugurated by mla roja in putturu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7327325-129-7327325-1590316164324.jpg)
వైకాపా పాలనపై ఆరోపణలు తగవు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనలో, ఇచ్చిన హామీలన్నీ 90 శాతం కంటే ఎక్కువే పూర్తి చేశామన్నారు. యనమల రామకృష్ణుడు ఏడాదిలో ఏమీ చేయలేదని ఆరోపణలు చేయటం తగదన్నారు. తెదేపా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలనే, పేరు మార్చి అమలు చేస్తున్నామని యనమల అంటున్నారనీ, తెదేపా హయాంలో అమ్మ ఒడి పథకం ఉందా అని నిలదీశారు.
ఇదీ చదవండి:మహిళా గ్రామ వాలంటీర్‌పై వైకాపా నేతల దాడి