తమకు అందిస్తున్న స్టైఫండ్ ను పెంచాలంటూ మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్లు, తితిదే అధికారుల మధ్య జరిగిన చర్చలు విజయవంతంగా పూర్తి అయ్యాయి. తితిదే ఈవో, స్టేట్ కొవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ కేఎస్ జవహర్ రెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తో.. స్విమ్స్ ఆసుపత్రి రెసిడెంట్ వైద్యులు సమావేశమయ్యారు. తమకున్న డిమాండ్లను వైద్యులు... ఈవో దృష్టికి తీసుకురాగా... తితిదే ఆధ్వర్యంలో నడిచే స్విమ్స్ ఆస్పత్రిలో వైద్యులకు ఎలాంటి లోటు రానివ్వమని జవహర్ రెడ్డి హామీ ఇచ్చారు. త్వరలోనే వైద్యుల డిమాండ్లను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ముగిసిన తితిదే, స్విమ్స్ ఆసుపత్రి వైద్యుల చర్చలు - latest news in chittor district
తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్లు, తితిదే అధికారుల మధ్య జరిగిన చర్చలు విజయవంతంగా ముగిశాయి. ఉద్యోగులకు ఎలాంటి లోటు రానివ్వమని జవహర్ రెడ్డి హామీ ఇచ్చారు.

తితిదే, స్విమ్స్ ఆసుపత్రి వైద్యుల చర్చలు