పర్యావరణహితంగా దీపావళి జరుపుకోవాలంటూ తిరుపతి ఎస్వీయూ ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో 5కే రన్ నిర్వహించారు. నగరంలోని ఎస్వీ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మార్‌పల్లి కూడలి వరకు సాగిన 5కే రన్‌ను ఎస్వీయూ ఉపకులపతి రాజారెడ్డి ప్రారంభించారు. దీపావళిని పర్యావరణ కాలుష్యరహితంగా చేసుకోవాలన్న ఆలోచనతో విద్యార్థులు 5కే రన్ ఏర్పాటు చేయడాన్ని వీసీ అభినందించారు. పర్యావరణాన్ని రక్షిస్తూ.. దీపాలతో దీపావళిని జరుపుకోవాలనేది తమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
5K RUN: పర్యావరణహితంగా దీపావళి జరుపుకోవాలని '5కే రన్' - Tirupati latest news
తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ ఎంబీఏ విభాగం 5కే రన్ నిర్వహించింది. పర్యావరణాన్ని రక్షిస్తూ.. దీపాలతో దీపావళిని జరుపుకోవాలనేది తమ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
5K run