చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో ఓ వివాహిత అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. బొమ్మాయిపల్లె ఎస్సీ కాలనీలో భాను అనే వివాహిత సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి.. పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు వైద్యశాలకు తరలించారు.
అల్లుడే చంపాడు..
అయితే తన కుమార్తెను అల్లుడు అనుదీప్, కుటుంబ సభ్యులే చంపారని మృతురాలి తల్లి సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమానం పెంచుకుని ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలిపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వీరిరువురూ పెద్దలకు ఇష్టం లేకుండా ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని చుట్టుపక్కల వారు చెబుతున్నారు.
ఇదీ చదవండి..
భార్యను దారుణంగా హతమార్చిన భర్త