చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండల కేంద్రంలో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. పెద్దమండ్యంలోని ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందగా.. తమ కుమార్తె మృతికి భర్త, కుటుంబీకులే కారణమని మృతురాలి తండ్రి ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించాడు. కడప జిల్లా రాయచోటికి చెందిన పీరా కుమార్తె హసీనాను పెద్దమండ్యం మండల కేంద్రంలోని రెడ్డిపీరాకు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపారు. కుమార్తె మృతిపై పలు అనుమానాలున్నాయని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివాహిత అనుమానాస్పద మృతి..భర్తపై ఫిర్యాదు - woman suspected death at chittoor district news update
చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండల కేంద్రంలో వివాహిత అనుమానాస్పదంగా ఉరివేసుకొని మృతి చెందింది. తన కుమార్తె మృతికి భర్త, కుటుంబ సభ్యులే కారణమని మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వివాహిత అనుమానస్పద మరణం
ఇవీ చూడండి...