ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పురోహితుడు లేకుండానే... తిరుమలలో పెళ్లిళ్లు! - marriages without priest news

కుటుంబ సభ్యులతో ఆనందంగా వచ్చి... వివాహం చేసుకునేందుకు తిరుమలకు తరలివస్తున్న వారికి నిరాశే మిగులుతోంది. తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద పెళ్లి తంతు నిర్వహించే పురోహితులు అందుబాటులో లేని కారణంగా... వధువు మెడలో వరుడు తాళి కట్టి, వెనుతిరుగుతున్నారు.

marriages
పురోహితుడు లేకుండా తిరుమలలో వివాహాలు

By

Published : Jan 25, 2021, 12:48 PM IST

తిరుమల శ్రీవారి ఆలయం వద్ద వివాహాలు చేసుకునేందుకు.. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. ఆలయం వద్ద పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించే పురోహితులు అందుబాటులో లేని కారణంగా.. ముహూర్త సమాయానికి వధువు మెడలో వరుడు తాళి కట్టి వెనుదిరుగుతున్నారు.

ఎందుకిలా..

తిరుమల శ్రీవారి కొండపై సంపన్నులు, మధ్య తరగతి, పేద వారు వివాహాది శుభకార్యాలు చేసుకునేందుకు వసతులు ఏర్పాటు చేశారు. పేదవారు వివాహాలు నిర్వహించుకునే పురోహిత సంఘాన్ని... కరోనా కారణంగా గతేడాది నుంచి మూసివేశారు. లాక్​డౌన్ నిబంధనలు సడలింపుల అనంతరం... మఠాల్లో, కల్యాణమండపాల్లో వివాహాలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చినా... పురోహిత సంఘానికి అనుమతులు ఇవ్వలేదు. ఈ కారణంగా... శ్రీవారి ఆలయం వద్ద వివాహాలు చేసుకునేందుకు వచ్చే వారు... పురోహితులు లేకుండానే పెళ్లి చేసుకుంటున్నారు. వివాహాలకు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చి... పురోహిత సంఘాలకు మాత్రం అవకాశం ఇవ్వకపోటంపై విమర్శలు వస్తున్నా, తితిదే అధికారులు మాత్రం కరోనాను సాకుగా చూపి కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి:

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి

ABOUT THE AUTHOR

...view details