Marital murder in Chittoor district: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కల్లుపల్లె పంచాయతీ మల్లేరులో వివాహిత గొంతు కోసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న రోజాను గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి చంపారు. రోజా(27)ను హత్య చేశాక.. ఆమె వద్ద ఉన్న నగలను దుండగులు ఎత్తుకెళ్లారు. రోజా తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెను అల్లుడే హత్య చేసి ఉంటాడని ఆరోపిస్తున్నారు. మృతురాలి బంధులువులు అల్లుడి ఇంటిపై గడ్డపార్లతో దాడికి పాల్పడ్డారు.
వివాహిత హత్య.. భర్తే హత్య చేశాడని తల్లిదండ్రుల ఆరోపణ - చిత్తూరుజిల్లా పలమనేరులో వివాహిత హత్య
Marital murder: చిత్తూరు జిల్లా గంగవరం మండలం మల్లేరులో వివాహిత హత్య సంచలనం రేపింది. దుండగులు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను గొంతుకోసి చంపి.. నగలు ఎత్తుకెళ్లారు. తమ కుమార్తెను అల్లుడే హత్య చేసి ఉంటాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు గంగవరం పోలీసులు తెలిపారు.
వివాహిత హత్య
రెండు సంవత్సరాల క్రితం మల్లేరుకు చెందిన యాదగిరితో రోజాకు వివాహం జరిగిందని, పెళ్లైన నాటి నుంచి యాదగిరి తమ కూతురిని వేధిస్తున్నాడని తల్లిదండ్రులు ఆరోపించారు. హత్య ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు గంగవరం పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి: