చిత్తూరు జిల్లా నగరిలోని మోర్ కింద కండిగ గ్రామం వద్ద 67కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ అధికారులు తెలిపారు. దాని విలువ రూ.10లక్షల 5 వేలు ఉంటుందని నగరి సీఐ తెలిపారు. దీనికి సంబంధించి నలుగురు మహిళలు సహా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
67 కేజీల గంజాయి పట్టివేత... ఐదుగురు అరెస్టు - raids by seb officials news
చిత్తూరు జిల్లా నగరి మండలం మోర్ కింద కండిగ గ్రామం వద్ద 67కేజీల గంజాయిని ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న నలుగురు మహిళలు సహా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
నెల్లూరు జిల్లా కోట మండలం సామంతమల్లం గ్రామం నుంచి తమిళనాడులోని తిరువళ్లూరుకి సుమోలో గంజాయిని తరలిస్తుండగా నగరిలోని సాయిబాబా గుడి వద్ద ఎస్ఈబీ సిబ్బంది వాహనాన్ని అడ్డుకున్నారు. తమిళనాడుకు వెళ్లేందుకు అనుమతించకపోవటంతో వాహనం డ్రైవర్ వాగ్వాదానికి దిగాడు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి రావటంతో సుమో వదిలి డ్రైవర్ పారిపోయాడు. వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. సుమోను సీజ్ చేసి, అదుపులోకి తీసుకున్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.
ఇదీ చదవండి:యువతి ఫోన్ నంబరు ఇవ్వలేదని.. తుపాకీతో యువకుడి వీరంగం!