ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రశాంత్ కిషోర్

తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, గోట్టిపాటి రవికుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, శివసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మిలింద్ నర్వేకర్ దర్శించుకున్నారు. దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్

By

Published : Oct 25, 2020, 10:28 AM IST

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, గోట్టిపాటిరవికుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, శివసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మిలింద్ నర్వేకర్ దర్శించుకున్నారు. దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఎమ్మెల్యే అనగాని మాట్లాడుతూ.. గీతం యూనివర్సిటీపై దాడులు హేయమైన చర్య అన్నారు. విద్యాలయం దేవాలయంతో సమానమని... అక్రమ కట్టడాలు అయినప్పుడు నోటీసులు ఇవ్వకుండా కూల్చడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తొలి నుంచి ప్రభుత్వం కూల్చివేతలపైనే దృష్టి పెట్టిందని విమర్శించారు. యూనివర్సిటీ ప్రహరీ కూల్చివేత చాలా బాదాకరంమన్న ఆయన..కూల్చివేతపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో చర్చ నడుస్తోంది అన్నారు.

ABOUT THE AUTHOR

...view details