ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మామిడి కాయల ట్రాక్టరు బోల్తా.. ఒకరు మృతి - mango tractor accident at penumuru

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు అల్లం చెరువు కట్టపై మామిడి కాయల ట్రాకర్టు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. 15 మందికి గాయాలయ్యాయి.

mango tractor turned at penamaluru.. one died
mango tractor turned at penamaluru.. one died

By

Published : Jun 15, 2021, 8:37 AM IST

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు అల్లం చెరువు కట్టపై ప్రమాదం జరిగింది. మామిడి కాయల ట్రాకర్టు బోల్తా పడి ఒకరు మృతి చెందగా.. 15 మంది గాయపడ్డారు. పాకాల మండలం దామలచెరువుకు చెందిన మామిడి కాయల వ్యాపారి ముస్తఫా (53) గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం జక్కదొన గ్రామానికి చెందిన రైతుల వద్ద మామిడి తోట కొన్నాడు.

మామిడి కాయలను కోసుకొని ట్రాక్టర్​లో నింపి కూలీలతో పాటు దామలచెరువు వెళ్తుండగా మార్గమధ్యంలోని పెనుమూరు సమీపంలో బోల్తా పడింది. డ్రైవరు పక్కన కూర్చొని ఉన్న ముస్తాఫా కిందపడగా టైరు అతనిపై ఎక్కింది. అతను అక్కడికక్కడే మరణించాడు. మామిడికాయల లోడుపై ఉన్న కూలీలు కాయలతో పాటు కిందపడ్డారు. బుజ్జమ్మ, రమేష్‌, మీనా తీవ్రంగా గాయపడ్డారు. ఐదురుగు పిల్లలతోపాటు ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై నరేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details